- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మెక్సికో నేవీకి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. టెక్సాస్‌లోని గాల్వేస్టోన్ కాజ్‌వే వద్ద కుప్పకూలింది. వైద్య కార్యకలాపాల కోసం వెళ్తున్న ఈ విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మెక్సికో నౌకాదళం తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో చిన్నారితో పాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ఉన్నారు. వీరిలో ఎవరు మృతి చెందారనేది స్పష్టం చేయలేదు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మెక్సికన్ అధికారులు తెలిపారు.
- Advertisement -



