Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రణాళిక, పట్టుదల, కృషి విజయానికి సోపానాలు 

ప్రణాళిక, పట్టుదల, కృషి విజయానికి సోపానాలు 

- Advertisement -

నవతెలంగాణ సదాశివ నగర్ : మండలంలోని ధర్మారావుపేటల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయస్ఫూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ షేక్ ఉమర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రణాళికతో, పట్టుదలతో, కృషి చేస్తే విజయ్ శిఖరాలను చేరుతామని తెలిపారు.  100% ఉత్తీర్ణత సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని విద్యార్థులకు సూచించారు. టీవీలకు, ఫోన్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు ఉన్నత లక్ష్యంతో చదవాలని తెలిపారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు పాఠశాల నుండి పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు యోసెఫ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల కలలు నెరవేర్చాలని కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు. పూర్వ విద్యార్థులు,  ధర్మరావుపేట ఎన్ఆర్ఐ శాఖ పాఠశాలకు అందిస్తున్న సేవలకు ప్రశంసించారు. అనంతరం గ్రామానికి చెందిన సామల అరుణ్ రెడ్డి, సామల రాజిరెడ్డి, బడల భరత్ కుమార్, బండి ప్రవీణ్  సహకారంతో విద్యార్థులకు పరీక్షా కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తులో చదవబోయే చదువులకు కావలసిన ఆర్థిక సహాయం అందిస్తామని, కెరియర్ గైడెన్స్ పూర్తిగా అందిస్తామని, వారి జీవితంలో స్థిరపడేంతవరకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ప్రమీల  , పూర్వ విద్యార్థుల ప్రతినిధి రామాంజనేయులు, ఉపాధ్యాయులు నరేందర్, చిన్నయ్య, విజయ శ్రీ, దయానంద్, జాస్మిన్, స్వామి, రాజు గౌడ్, శ్రీనివాస్,  సుకుణ, అన్వర్,  కృష్ణాకర్ రావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -