Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు

- Advertisement -

హెలీ-బోర్న్‌ సర్వేకు శ్రీకారం

  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దష్టి
  • మూడు షిఫ్ట్‌ల్లో టన్నెల్‌ నిర్మాణం
  • భద్రతా ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ
  • నేడు సీఎంతో సమావేశం : సమీక్షలో మంత్రి ఉత్తమ్‌

    నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
    ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణ కోసం ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. అందులో భాగం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన ప్రకటించారు. అందులోభాగంగానే గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్నటు మంత్రి చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ పనుల పురోగతిపై బుధవారం రోజున డాక్టర్‌ బి.ఆర్‌.అంబెడ్కర్‌ సచివాలయం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సలహాదారులు అదిత్యా దాస్‌ నాద్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ హార్పల్‌ సింగ్‌, సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్‌, ఈఎన్సీలు అంజత్‌ హుస్సేన్‌, శ్రీనివాస్‌, రమేష్‌బాబుతోపాటు ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు, సీఈ నల్లగొండ అజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నెలకు 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గాను ఇప్పటికే 35 కిలో మీటర్ల సొరంగం తవ్వడం పూర్తి అయ్యిందనీ, మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించ బోతున్నట్టు ఆయన తెలిపారు. అందులో భాగంగా ప్రపంచం మొత్తంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్‌ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నేషనల్‌ జియో ఫిజికల్‌ రీసెర్చ్‌ సంస్థ ఈ సర్వే నిర్వహించ తలపెట్టినట్టు ఆయన తెలిపారు. తద్వారా సొరంగ మార్గం తవ్వకాల సమయం లో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఇంజినీర్లకు ఉంటుం దన్నారు. నీటిపారుదల సలహాదారుడిగా లెఫ్టినెంట్‌ జెనరల్‌ హార్పల్‌ సింగ్‌ నియామకం ఈ సొరంగ మార్గం పూర్తికి దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సొరంగ మార్గం తవ్వకాల సమయంలో గాలి, వెలుతురు ఆవశ్యకతతో పాటు నీటిపారుదల రంగంలో యువ ఇంజినీర్లకు శిక్షణ ఇచ్చే ఆవశ్యకతను వివరించారు. ఎటువంటి జాప్యం లేకుండా సత్వరమే సర్వే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండువైపులా మొదలు పెట్టిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం తవ్వకాలలో ఒక భాగం నుంచి 21 కిలోమీటర్లు పూర్తి కాగా మరో వైపు 14 కిలో మీటర్లు పూర్తయిం దన్నారు. మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు పూర్తికి మూడు షిఫ్టుల్లో పనిచేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటే నిర్ణిత వ్యవధిలో పనులు పూర్తి అవుతాయన్నారు. ఆయా షిఫ్ట్‌ల్లో యువ ఇంజినీర్లను నియమించి రోజువారీ పురోగతిని రికార్డ్‌ చేయాలన్నారు. అందుకుగాను యువ ఇంజినీర్లకు శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు కల్పించి సొరంగ మార్గం తవ్వకాలలో అనుభవం గడించేలా చూడాలన్నారు. సవరించిన అంచనాల పరిధిలోనే ప్రాజ ెక్టును పూర్తి చేయాలని ఆయన ఏజెన్సీలకు సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం తవ్వకాల సమయంలో వస్తున్న నీటిని పంపింగ్‌ చేయడానికి విద్యుత్‌ బిల్లులు సంవత్సరానికి 500 నుంచి రూ. 550 కోట్లు చెల్లిస్తున్నా మన్నారు. పైగా పంపింగ్‌ కోసం వినియోగిస్తున్న మోటార్లు 20 సంవత్సరాలు పూర్తి కావడంతో అదనపు భారాన్ని భరిస్తూ మోటార్లను మార్చాల్సి వస్తుందన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad