Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హసకోత్తూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో మాస్ ప్లానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలు నాటి పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనమంతా పాటుపడాలన్నారు. మొక్కలు నాటి పెంచడం మన బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,కాంగ్రెస్ నాయకులు కుందేటి శ్రీనివాస్, ఏనుగు మనోహర్, పెద్ది సృజన్, ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్,అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘం సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -