Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి: డీఎస్పీ సూర్యనారాయణ

మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి: డీఎస్పీ సూర్యనారాయణ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ,సిఐ నాగార్జున రావు లు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా బుధవారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో 2025 వన మహోత్సవం వంద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడారు మొక్కలు నాటి అటవీ విస్తీర్ణం పెంపుదలకు కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో ప్రజలందరూ పాల్గొని భావితరాల భవిష్యత్తుకు తోడ్పడాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad