Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెట్ల పెంపకమే భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బహుమతి : సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్

చెట్ల పెంపకమే భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బహుమతి : సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్

- Advertisement -

స్వచ్ఛమైన పర్యావరణాన్ని యధావిధిగా ముందు తరాలకు అందించాలి : గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్
గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ లో అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమం
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ

చెట్ల పెంపకమే భవిష్యత్ తరాలకు అందించే గొప్పబహుమతి అని, మొక్కలు నాటి సంరక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ తెలిపారు.  కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, క్షేత్ర కార్యాలయం, నిజామాబాద్ ఆధ్వర్యంలో గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ మాట్లాడుతూ…. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణంతో కూడిన భూమిని అందించటం మనందరి బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. పర్యావరణం – ప్రగతిని సమన్వయం చేసుకుని ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని, ఈ దిశగా విద్యార్థులంతా అమ్మ పేరిట ఒక మొక్క స్ఫూర్తిని వ్యాప్తి చేయటంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కులు నాటడమే కాకుండా, ఆ చాయా చిత్రాన్ని తీసుకుని #Plant4Mother హ్యాష్ ట్యాగ్ లను వినియోగించి సామాజిక మాథ్యమాల్లో పంచుకోవాలని సూచించారు.

స్వచ్ఛమైన పర్యావరణాన్ని యధావిధిగా ముందు తరాలకు అందించాలి : గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్

స్వచ్ఛమైన పర్యావరణాన్ని యధావిధిగా ముందు తరాలకు అందించాలని గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందన్నారు. మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను యధావిధిగా ముందు తరాలకు అందించడం తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో ఎన్ సిసి ఆఫీసర్ డాక్టర్ ఎం రామస్వామి, సెంట్రల్ బ్యూర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ అసిస్టెంట్ రసిద్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -