నవతెలంగాణ – కమ్మర్ పల్లి : వన మహోత్సవం కార్యక్రమం కోసం నర్సరీల్లో సిద్ధం చేస్తున్న మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని నర్సరీ నిర్వాహకులకు ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం మండలంలోని రాజరాజేశ్వరీ నగర్ లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన పరిశీలించారు. మొక్కల సంరక్షణపై నర్సరీ నిర్వహకులకు పలు సూచనలు చేశారు. నర్సరీలో సిద్ధం చేస్తున్న మొక్కల రకాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో చేపట్టబోయే వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో నాటేందుకు కావలసిన మొక్కల్ని జాగ్రత్తగా సంరక్షించాలన్నారు. నర్సరీలో లక్ష్యం మేరకు మొక్కలను సిద్ధంగా ఉంచాలన్నారు.ఎండిపోయిన, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కల్ని సిద్ధం చేయాలన్నారు. మొక్కల సంరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించోద్దని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ ఉన్నారు.
మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES