- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
పర్యావరణ పరిరక్షణకు..ఆహ్లాదకరమైన వాతావరణానికి విరివిగా మొక్కలు నాటాలని ఎస్ఐ సౌజన్య ప్రజలకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం వద్ద సీపీఐ నాయకుడు సంగెం మధు అధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎస్ఐ సౌజన్య,మాజీ ఎంపీపీ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మాజీ ఏఎంసీ చైర్మన్ అక్కరవేణీ పోచయ్య ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,గ్రామస్తులు ఐలేని మహేందర్ రెడ్డి,ఇస్కిల్లా ఐలయ్య,ఎలిగే సతీశ్,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -