Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టర్ అఫ్ పారిస్ వల్ల పర్యావరణానికి హాని..

ప్లాస్టర్ అఫ్ పారిస్ వల్ల పర్యావరణానికి హాని..

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ – వెల్దండ

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఇండ్లలో గణపతిని పూజించేవారంతా మనపురాతన, శాస్ట్రోతమైన సంప్రదాయ మట్టి వినాయకులను పూజించాలని, రసాయన రంగులతో కూడిన ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాల తో పర్యావరణానికి హాని జరుగుతుందని  తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో  తయారుచేసిన  విగ్రహాలు నీటిలో కరగవు అదే మట్టితో చేసిన విగ్రహాలు అయితే వెంటనే రెండు లేదా మూడు గంటలలో కరుగుతాయన్నారు. పర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మనలో ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజు మట్టి వినాయక విగ్రహాలు ఇంట్లో ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కొంత మేర కాపాడాలని కోరారు. మన పూర్వీకులు చెరువు మట్టితో వినాయక విగ్రహాన్ని తయారుచేసి తిరిగి అదే చెరువులో నిమజ్జనం చేసేవారని, మన పండుగల్లోని పరమార్థం, మన ఆరోగ్యం, ప్రకృతిని కాపాడుకోవడమేనని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad