Tuesday, February 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఎడ్ బిడ్ జాతరలో ప్లాస్టిక్ నిషేధం..

ఎడ్ బిడ్ జాతరలో ప్లాస్టిక్ నిషేధం..

- Advertisement -

అన్నదానంలో స్టీల్ ప్లేట్లు, గ్లాసుల వాడకం..
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో మల్లన్న జాతరలో అన్నదానం లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. ఆలయ కమిటీ గ్రామస్తులు, సమిష్టి నిర్ణయంతో ఈసారి జాతరలో అన్నదానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడకాన్ని నిషేధించాలని తీర్మానించారు. గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమన్ 1000 స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను, కొనుగోలు చేశారు. అన్నదానంలో కొంతమంది దాతలు కూడా తమ వంతు సహాయాన్ని అందించారు. స్టీల్ ప్లేట్లు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేయడంతో అన్నదానంలో కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.

జాతరకు వచ్చే వేలాది మంది భక్తులకు స్టీల్ ప్లేట్లనే అన్నదానం చేశారు. ఆలయ కమిటీ, గ్రామస్తులు ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేదాన్ని గ్రామస్తులు అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు‌. గ్రామస్తుల కృషి ని పలువురు అభినందించారు. జాతరలో కుస్తీ పోటీలు ఉండటంతో మంగళవారం వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ జాతర బుధవారం రోజున ముగుస్తుంది. జాతర ముగిసే వరకు అన్నదాన కార్యక్రమం యధావిధి గా కొనసాగనుంది‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -