మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – మల్హర్ రావు:
క్రీడాకారులు ఓటమిని స్పిరిట్ గా భావించాలని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.మండలంలోని తాడిచర్ల గ్రామంలో రామిడి రవి జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్‌లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జన్మించిన రామిడి రవి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. అయితే తన మేనమామ జ్ఞాపకార్థంగా ఆయన మేనల్లుడు సుంకరి సాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇన్నేండ్లుగా నాయకుల మెప్పు కోసం అనేక మంది గ్రామీణ క్రీడలు నిర్వహిస్తుంటారని, అలాంటి సంస్కృతిని విడనాడాలని, మన తల్లిదండ్రుల పేరుతో వారి జ్ఞాపకార్థంగా క్రీడాపోటీలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటమిలు సహజమని, ఓటమిని ఒక స్పిరిట్‌గా తీసుకుని గెలుపుకు ప్రయత్నం చేయాలని, అలాగే గెలిచిన క్రీడాకారులు మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రథమ బహుమతి సాధించిన వల్లెంకుంట, రెండో బహుమతి సాధించిన కిషన్‌రావుపల్లి క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.
క్రీడాకారులు ఓటమిని స్పిరిట్‌గా తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES