– కుళ్లిన చికెన్, మటన్ వినియోగం
– గడువు తీరిన వస్తువులతో వంటకాలు
– ఆహార నాణ్యతా ప్రమాణాలపై నిర్లక్ష్యం
– హౌటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై నిఘా కరువు
– సూపర్‌మార్కెట్లలో గడువు ముగిసిన వస్తువుల విక్రయాలు
– మొక్కుబడి తనిఖీలు.. శాంపిళ్లు సేకరించినా చర్యలు శూన్యం
– ప్రమాదమని తెలిసినా గోప్యత పాటిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు
– వ్యాపారులకు వత్తాసు పలుకుతూ ఆరోగ్యాలతో చెలగాటం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజల ప్రాణాలతో చెలగాటం. కుల్లిన చికెన్, మటన్, చేపల్ని వినియోగిస్తున్నారు. గడువుతీరిన, నాణ్యతా ప్రమాణాల్లేని వస్తువులతో వంటకాలు చేస్తున్నారు. అడ్డగోలుగా మసాలలు, రసాయనాలు వాడి గుమగుమ లాడే వంటకాల పేరిట నాణ్యతాప్రమాణాలకు పాతరేస్తు న్నారు. లాభాపేక్షతో కల్తీ, నాసిరకం వస్తువుల్ని వినియో గిస్తూ చేసే వంటకాల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలతో పాటు మోర్, రిలయన్స్, రత్నమాల, విజేత వంటి సూపర్ మార్కెట్లలోనూ గడువు తీరిన ఆహార పదార్ధాలను విక్రయిస్తున్నారు. పిర్యాదులు చేస్తే తప్ప ఆహార తనిఖీలు పట్టట్లేదు. పుడ్ ఇన్స్‌స్పెక్టర్స్, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రత విభాగం మొక్కు బడి తనిఖీలు చేసి చేతులు దులుపుకుం టున్నారు. కొద్దిపాటి జరిమానాలు విధించ డం, నోటీసు లివ్వడంతోనే సరిపుచ్చుతున్నారు. పెద్ద హోటళ్లు, రెస్లారెంట్లు, దాబా లు, సూపర్‌మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో ముడుపుల రూపంలో సొమ్ము ముడుతుండడంతోనే కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. సేకరించే షాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంప డం, ఆ తర్వాత రిపోర్టు లు సరిగ్గానే వచ్చాయని చెప్పి వ్యాపారుల్ని కాపాడే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీ వల సంగారెడ్డి, హైదరా బాద్, మిర్యాలగూడ వంటి పట్టణాల్లో చేసిన తనిఖీల్లో కుల్లిన చికెన్, మటన్, ఆహార పదార్ధాలను సీజ్ చేశారు. పలు సూపర్ మార్కెట్లలో గడువు తీరిన వస్తువుల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కానీ..! కఠినమైన చర్యలు తీసుకున్నదిలేదు.
రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే విధమైన పరిస్థితి ఉన్నా తనిఖీలు చేపట్టి చిన్నపాటి చర్యలతో మమ అనిపిస్తున్నారు. పెద్దవారికి ఒక రకంగా, చిన్న వారికి మరోరకంగా అన్న పద్ధతిలో అధికారులు ఉంటున్నారని తెలిసింది. పుచ్చుకునే వాటాల ఆధారంగా ఈ చర్యలు ఉంటున్నాయని అనుకుం టున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ వంటి పట్టణాల్లో వందల సంఖ్యలో హౌటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ కేవలం రెండు, మూడు చోట్ల మాత్రమే తనిఖీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. హౌటల్స్, దాబాలు, బార్లలో నాసిరకం ఆహార పదార్థాలు అమ్ము తున్నా అటు వైపు కన్నెత్తి చూడరు. కంది మండలం లోని ఓ దాబాలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహి ంచి నాసిరకం ఆహార పదార్థాలు, కాలం చెల్లిన రసాయనాలు, కారం పొడులు, కల్తీ నూనెలు ఉన్నాయని గుర్తించారు. ఎంఎన్ ఆర్‌లో పురుగుల అన్నం ఉందంటూ గతేడాది జూన్ 25వ తేదీన తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరిం చారు. కాలం చెల్లిన ఆహర పదా ర్థాలు, కల్తీ నూనెలు, మసాలాలు గుర్తించారు.
అక్కడ కూడా శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు వాటికి సంబంధించి రిజల్ట్ ఇంకా బయట పెట్టలేదు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి హౌటళ్లు, రెస్టా రెంట్లలో ఆకస్మిక తనిఖీ లు జరిపి నాణ్యతా ప్రమాణాలు పాటించ కుండా నడుస్తున్న హౌటల్స్ యాజమాన్యా లపై చర్యలు తీసుకొని వాటి గుర్తింపు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.
హౌటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై నిఘా కరువు..
గత సంవత్సరంలోనే సదాశివపేటలోని ఓ బార్‌లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో పురుగులు వచ్చాయి. దీనిపై సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన కొందరు అధికారులు బార్ యాజమాన్యం ఇచ్చే తాయిలాలకు ఆశపడి బార్‌లో ఎలాంటి తనిఖీలు చేయకుండా అన్ని సక్రమంగా ఉన్నాయని కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. బార్ యాజ మాన్యం అధికారులకు ఆమ్యామ్యాలు ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు ఆందోళన చేపడితే మున్సిపల్ కమిషనర్ ఆ బార్ యాజమాన్యానికి రూ.10 వేల జరిమానా విధించి చేతులు దులిపేసు కున్నారు. అయి తే, ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలిచ్చిన వరుస ఫిర్యాదు లతో తప్పని పరిస్థితుల్లో ఆ బార్‌కు వెళ్లి కొన్ని శాంపిళ్లు సేకరిం చారు. కానీ ఆ బార్‌పై ఎలాంటి చర్యలు తీసుకో లేదు.
తనిఖీలు నిర్వహించాం : ఫుడ్ సేఫ్టీ అధికారి అమృత
సంగారెడ్డి జిల్లాలో పలు హౌటళ్లు, దాబాల్లో తనిఖీలు నిర్వహించాం. అందులో ఆహార పదార్థాలు, నూనెలు, కారంపోడి వంటి వాటిని శాంపిళ్లు తీసుకున్నాం. వాటిని హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపించాం. శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు రాలేదు. వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం. ఎంఎన్‌ఆర్, కింగ్స్ దాబాల్లో సేకరించిన శాంపిళ్లలో కొంత మేర కల్తీలు ఉన్నట్టు తేలింది. వాటిపై ఫైన్ కూడా వేశాం. ఇంకా జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తాం.
సంగారెడ్డి జిల్లాలో కనిపించని తనిఖీలు..
జిల్లాలో కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు కేవలం శాంపిళ్లు తీసుకెళ్లి చేతులు దులిపే సుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయలు, పండ్లు, మాంసం వంటి వాటిపై శుచి, శుభ్రత కరువవుతోంది. చిన్న హౌటళ్ల నుంచి స్టార్ హౌటళ్ల దాకా ప్రతిచోటా తనిఖీలు చేయాల్సి ఉన్నా పట్టింపు కరువైంది. జిల్లాలో అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా, లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రాణాలతో చెలగాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES