Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాకు జీతం ఇప్పించండి మహాప్రభో..

నాకు జీతం ఇప్పించండి మహాప్రభో..

- Advertisement -

– ప్రజావాణిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆవేదన
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్  : తాను రెండు సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అధికారులు తనకు జీతం ఇవ్వడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రజావాణిలో ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో  2020 ఆత్మకూర్ ప్రభుత్వ హాస్టల్ ఎస్సీ డిడి గర్ల్స్ హాస్టల్లో  2 ఔట్సోర్సింగ్  పద్ధతిలో నియామకం మహిళ వాచ్ మెన్ గా   కలెక్టర్  ఎల్ ఆర్ నెంబర్: ఏ /313/2019,  10/06/2020 విధులలో జాయిన్ అయి  2023 సంవత్సరం వరకు పని చేసినట్లు తెలిపారు. కాగా 2023లో  అనారోగ్య సమస్య అన్నగా  ఆపరేషన్ చేయడం వలన విధులకు హాజరు కాలేకపోయామని తెలిపారు. విధులకు హాజరు కానందుకు   2023 సంవత్సరంలో నేను అప్పటి డి ఎస్ సి డి ఓ    కి చెప్పి ’08 నెలలు” సెలవు లు పెట్టగా, మళ్లీ జూన్ లో తిరిగి విధులోకి  తీసుకున్నట్లు తెలిపారు. 

 జూన్ లో నన్ను  బీబీనగర్ ప్రభుత్వ బాయ్స్ ఎస్సీ డిడి   హాస్టల్ లో  వెంకటయ్య రిటర్మెంట్ కాగా ఆయన స్థానంలో నన్ను వాచ్మెన్ గా నియమించారని డీఎస్సీడీవో ఎల్ ఆర్ నెంబర్ ఏ/ 649/2019, న 09/08/2024 వ తేదీన వీధుల్లోకి తీసుకున్నారు. అప్పటినుంచి  రావలసిన (2)సంవత్సరాల జీతం ఇవ్వడం లేదన్నారు. 

ఆమెకు సంబంధించిన ఫైలును పరిశీలిస్తున్నాను… యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఇన్చార్జి  ఆఫీసర్  సాహితి… రాజల్లాకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి యొక్క నియమ నిబంధనలను పరిశీలించి, ఉద్యోగికి న్యాయం చేస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -