Thursday, February 5, 2026
E-PAPER
Homeజిల్లాలు4 వ వార్డ్ సీపీఐ(ఎం) అభ్యర్థి మోరిగాడి భాగ్యలక్ష్మిని గెలిపించండి

4 వ వార్డ్ సీపీఐ(ఎం) అభ్యర్థి మోరిగాడి భాగ్యలక్ష్మిని గెలిపించండి

- Advertisement -

కల్లూరి మల్లేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ ని గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి కోరారు. పట్టణంలోని బుడగ జంగాల కాలనీ మహాలక్ష్మి రైస్ మిల్ ద్వారక నగర్ లో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ..  కమ్యూనిస్టులు ఒక్కరు ఉన్న 100 మందితో సమానం అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన వారు ప్రజల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించుకోవడం వలన ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

పాలకవర్గంలో ప్రజా గొంతుకగా పనిచేస్తారని అలా కాకుండా డబ్బుతో మందుతో రాజకీయాలకు ప్రలోభాలకు లోనైతే వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారం కావన్నారు. ఐదు సంవత్సరాలపాటు ప్రజలు నాయకులను ఎన్ని కష్టాలు వచ్చినా భరించవలసి వస్తుందన్నారు. గత పాలకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయని, ఆలేరు పట్టణంలో మురుగు కాలువల నిర్మాణం సీసీ రోడ్డు నిర్మాణం కమ్యూనిటీ హాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని విమర్శించారు. ఐదు సంవత్సరాల కాలంలో కనీసం చెత్త డంపింగ్ యార్డ్ ను సైతం ఏర్పాటు చేసుకోని దీన వ్యవస్థలో మున్సిపల్ వర్గం ఐదేళ్ల పాలన గడిచిపోయిందని అన్నారు.

రాబోయే పాలవర్గంలో కమ్యూనిస్టులు ఒక్కరైనా గెలిపిస్తే మున్సిపాలిటీ నిధులను దోచుకోకుండా కాపలా ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పాలకవర్గాన్ని నిలదీసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి జరుగుతుందన్నారు. నాల్గవ వార్డులో గతంలో గెలిచినవారు వార్డును గాలికి వదిలేసిన విషయం మీకు తెలిసింది అన్నారు. పోటీలో ఉన్న మరో వ్యక్తి డబ్బులతో ప్రజల కొనేసి గెలవాలని చూస్తున్నప్పటికీ అధికార పార్టీ అండదండలు లేకపోవడంతో అభివృద్ధి జరగదని ప్రజలు తెలుసుకోవాలన్నారు సీపీఐ(ఎం) కాంగ్రెస్ స్నేహ పూర్వక పోటీలో భాగంగా మొరిగాడి భాగ్య లక్ష్మి అజయ్ పార్టీలు మారకుండా నమ్మిన సిద్ధాంతం కోసం చివరిదాకా నిలబడే కుటుంబం నుండి వచ్చిన అభ్యర్థిని ప్రజల ఆదరిస్తారని నమ్మకం మాకు ఉందన్నారు.

మూడో వార్డులో పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి సందుల సురేష్ గెలుపు కోసం పోటీ నుండి విరమించుకున్నట్లు చెప్పారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సరైన అభ్యర్థి అంటూ భాగ్యలక్ష్మిని ప్రజల ఆదరించడం పట్ల నాలుగవ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, మోరిగాడి రమేష్, జూకంటి పౌలు వడ్డేమాన్, బాలరాజు, మోరిగాడి మహేష్, చెన్న రాజేష్, ఘణగాని మల్లేష్, బొప్పిడి యాదగిరి, వడ్డేమాన్ బాలరాజు, మోరిగాడి అజయ్, మోరిగాడి భాగ్యలక్ష్మి ,మొరిగాడి పుష్ప, మద్దెల కుమార్ యాసారపు ప్రసాద్, మొరిగాడి అంజయ్య, గొడుగు దాసు , మోరిగాడి అనిత, శ్రీమాన్ బాబు, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -