Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్న ధర్నాను జయప్రదం చేయండి..

కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్న ధర్నాను జయప్రదం చేయండి..

- Advertisement -

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొర్ర శంకర్ 
నవతెలంగాణ – అచ్చంపేట

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని టి ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొర్ర శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిటైర్మెంట్ అయినా ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే ప్రకటించాలని, 5571 పి ఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి బిఎడ్, డిఎడ్ అర్హతగల ప్రతి ఎస్జీటీ ఉపాధ్యాయులకు పిఎస్ హెచ్ఎంగా పదోన్నతి ఇవ్వాలన్నారు.

 కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించన్నారు.గురుకుల పాఠశాలలన్నింటినీ ఒకే గొడుగు  కిందకి తీసుకొచ్చి కామన్ డైరెక్ట్ రేట్ ఏర్పాటు చేయాలన్నారు. ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు బాబురావు, రామకృష్ణ,సీనియర్ నాయకులు బిచ్చ్య నాయక్ , మండల నాయకులు ధన్సింగ్, రహీం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -