Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుడ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ

- Advertisement -
  • తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో యువకవుల ప్రమాణం
  • నిర్వహించిన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మారకద్రవ్యాలను విచ్చలవిడిగా విక్రయించడానికి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని, వాటికోసం వివిధ ప్రాంతాలను ఎంపిక చేసి, కొంతమంది యువకులకు డబ్బును ఎరగా చూపి వివిధ మార్గాలలో మత్తు పదార్థాలను విక్రయిస్తూ దేశ భవిష్యత్తుని నిర్వీర్యం చేయాలనుకునే వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నామోజు బాలాచారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ఇప్పుడు జరుగుతున్న మత్తు పదార్థాల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్న నేటి పరిస్థితులలో ‘డ్రగ్స్ రహిత దేశంగా”మన దేశాన్ని నిర్మించాల్సింది విద్యార్థులే అని తన అధ్యక్ష ఉపన్యాసంలో ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాను సారము బుధవారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో కార్యదర్శి బాలాచారి ఆధ్వర్యంలో “డ్రగ్స్ రహిత సమాజం కోసం – ప్రతిజ్ఞ” అనే కార్యక్రమం నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న ఈ సమావేశంలో ‘డ్రగ్స్ రహిత సమాజం కోసం’ ప్రతిజ్ఞ చేయించారు. ఈ అంశంపై ప్రత్యేకంగా ‘యువకవి సమ్మేళనం’ నిర్వహించడం జరిగింది. బాలాచారి మాట్లాడుతూ డ్రగ్స్ సెల్ ఫోను మొదలైన వాటికి నేటి యువతరం బానిసలుగా కాకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని కళాశాల, నిజాం కళాశాల విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ కు బానిసత్వాన్ని నిరసిస్తూ తమ కవితలను, ప్రసంగాలను, నినాదాలను అద్భుతంగా వినిపించారు.

ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని కళాశాల లెక్చరర్ ఉదయశ్రీ పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు పిల్లల ద్వారా నిర్వహించడం వల్ల పిల్లలు మంచి వైపుకు మారే అవగాహనను కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రముఖ కవి, డాక్టర్ చమన్ సింగ్ మాట్లాడుతూ, డ్రగ్స్ కు అలవాటు పడిన నేటి యువతరం పేషెంట్లుగా తయారై తమ జీవితాన్ని, ఇంటిని, తద్వారా దేశాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో తన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, సీనియర్ కవి రేడియం కొండన్న, అనంతోజు మోహన్ కృష్ణ, నక్క శ్రీనివాసు, సినీ డైరెక్టర్ నామాల రవీంద్ర సూరి, రాపోలు సుదర్శన్, తిరుపాల్, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ కవితలను వినిపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img