Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాల నిరోధకంపై కళాశాలలో ప్రతిజ్ఞ

మాదకద్రవ్యాల నిరోధకంపై కళాశాలలో ప్రతిజ్ఞ

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణామూలంగా పేద ప్రజల కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి మాదకద్రవ్యాలు గంజాయి రవాణా మొదలైనటువంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకొని నియంత్రించడానికి కృషి చేయాలని కోరారు. గ్రామాలలో గంజాయి క్లోరోహైడ్రేట్ మొదలైన అంశాలపై అవగాహన కల్పిస్తూ అరికట్టడానికి కృషి చేయాలని సూచించారు. మాదకద్రగాలు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే విద్యార్థులు వెంటనే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ సంధర్భంగా మాదక ద్రవ్యాల నిరోధకంపై  అధ్యాపకులు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు రాజగోపాల్, లక్ష్మణ్, విజయ్ కుమార్, రమేష్, వేంకట స్వామి, సరిత, సుజాత ,స్వప్న మమత నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad