Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ

ప్రభుత్వ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రతిజ్ఞ చేయించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, రక్షణ శాఖ అధికారులు మాదకద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ కార్యక్రమము చేయించారు.సమాజంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూలంగా పేద ప్రజల కుటుంబాలు చిన్నా భిన్నమవుతున్నాయని భీంగల్ ఎక్సైజ్ సీఐ వేణుమాధవరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సీ ఐ వేణుమాధవరావు, ఎస్ ఐ గోవర్ధన్ మాట్లాడుతూ… విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఈ మాదకద్రవ్యాల వలలో పడకుండా వాటికి బలికాకుండా ఉండాలని అన్నారు. ఇలాంటి మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా మొదలైనటువంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకొని నియంత్రించడానికి కృషి చేయాలని కోరారు. గ్రామాలలో గంజాయి, క్లోరోహైడ్రేట్ గురించి అవగాహన కల్పిస్తూ అరికట్టడానికి కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే విద్యార్థులు వెంటనే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని సీఐ వేణుమాధవ్ వివరించారు. ఏ ఒక్కరు కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు లోబడకుండా ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతూ డ్రగ్స్ నివారిత గ్రామాలుగా మార్చడంలో ప్రతి ఒక్కరి చేయూత అందించాలన్నారు.

ఈ డ్రగ్స్ ను నివారించడంలో పాలు పంచుకోవాలని విద్యార్థిని విద్యార్థులతో కోరారు. యువత ఈ మత్తు పదార్థాల వలలో చిక్కుకున్నట్లయితే విద్య, ఉద్యోగం, పాస్పోర్టు ఇలా ఎలాంటి ప్రభుత్వ లాభదాయకమైన వసతులను పొందడానికి అనర్హులుగా ప్రకటించబడతారు. కాబట్టి ఇలాంటి మత్తుపదార్థాల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మాదకద్రవ్యాల నివారణ అనే అంశంపైన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సీ, ఐ వేణు మాధవరావు, ఎస్సై  గోవర్ధన్, రక్షణ శాఖ అధికారి ఎస్సై కే. సందీప్, ఏ ఎస్సై అబ్దుల్ సత్తార్, ఎక్సైజ్ శాఖ అధికారులు , కళాశాల ప్రిన్సిపల్ సి జయపాల్ రెడ్డి, కౌన్సిలర్లు పల్లె శ్రీనివాస్ గౌడ్, మండలోజు నర్సింహస్వామి, పోలీస్ అధికారులు ,కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -