- Advertisement -
నవతెలంగాణ- ఆర్మూర్
ఆలూర్ మండలంలోని దేగాం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు మంజూరు చేయబడినట్లు బుధవారం స్థానిక నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న గృహాలు ఇప్పటివరకు నియోజకవర్గంలో 4000 గృహాలను స్థానిక శాసనసభ్యులు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు సహకారతో నిర్మిస్తున్న ఈ ఇళ్లను మంజూరు చేయించడం జరిగిందని, పిప్పిరి గ్రామం నుండి దేగాం గ్రామం వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో డబుల్ రోడ్డు మంజూరు చేయించినందుకు గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -