- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా లో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రణయ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అర్హులైన వారికి ఈ పథకం కింద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి ప్రణయ్ తెలిపారు. ఒకపక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల సర్వే మరోపక్క పీఎం ఆవాస్ యోజన పథకం సర్వే కార్యక్రమాన్ని పంచాయతీ సెక్రెటరీ చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ఇండ్లు మంజూరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు అవుతాయని తెలిపారు.. ఈ సర్వేలో గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -