మాజీ ఎంపీ, టీఏజీఎస్ అధ్యక్షులు మిడియం బాబురావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం దేశం లోని పీవీటీజీ తెగల అభివృద్ధి, ఇండ్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్ర స్థాయిలో వాటికి నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎంపీ, టీఏజీఎస్ అధ్యక్షలు డాక్టర్ మిడియం బాబూరావు డిమాండ్ చేశారు. పీఎం జన్మన్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా మంగళవారం హైదరాబాద్ లో టీఏజీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ సంస్కృతి సంచికను విడుదల చేశారు. ఈ సందర్బంగా బాబూరావు మాట్లాడుతూ అంతరించి పోతున్న పీవీటీజీ తెగల భాష, సంస్కృతిని పరిరక్షించాలనీ, కేంద్ర బడ్జెట్‌లో పీఎం జన్మన్ నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఆదివాసీల సంస్కృతిపై సావనీర్ తేవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఉపాధ్యక్షులు సున్నం గంగ, రవి కుమార్, కారం పుల్లయ్య, ఆత్రం తనుష్, కోట శ్రీనివాస్, తొడసం శంబు, దుగ్గి చిరంజీవి, దామోదర్, నేర్పల్లి అశోక్, పొలం రాజేందర్, ఉయిక విష్ణు, గౌరీ నాగేశ్వరావు, పాయం నరసింహ రావు, మడవి నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు.
పీఎం జన్మన్ నిధులు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES