- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జీ20 సమావేశం నేపథ్యంలో భారత్ ప్రధాని మోడీ దక్షణాఫ్రికా చేరుకున్నారు. విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శన బృందం పీఎం మోడీకి ఘన స్వాగతం పలికింది. జోహెన్‌స్ బర్గ్ వేదికగా రెండు రోజుల పాటు జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇండోనేషియా, భారతదేశం, బ్రెజిల్ అధ్యక్ష పదవుల తర్వాత, గ్లోబల్ సౌత్ నిర్వహిస్తున్న వరుసగా నాల్గవ G20 సమావేశం ఇది. దక్షిణాఫ్రికాకు ముందు, G20 అధ్యక్ష పదవులను బ్రెజిల్ (2024), భారతదేశం (2023), ఇండోనేషియా (2022) నిర్వహించాయి. కాగా, ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు హాజరకావడంలేదని వైట్‌హౌస్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
- Advertisement -



