నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే నెల నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ రెండు దశలో జరగనున్న విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ స్థానాలకు 6న 121 స్థానాలకు పోలింగ్ జరగగా, మిగిలిన స్థానాలకు 11న ఎలక్షన్స్ జరగనున్నాయి. అదే నెల 14న పోలింగ్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే ప్రధాన కూటములు ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను పేర్లను ఖరారు చేశాయి. అదే విధంగా నామినేషన్ల ప్రక్రియ కూడా ఇటీవల ముగిసింది. దీంతో ప్రధాన పార్టీలన్ని ప్రస్తుతం ప్రచారంపై ఫోకస్ చేశాయి.
ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు (Bihar Assembly election). సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం అందుకు వేదికైంది. బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్ (Karpoori Thakur)కు నివాళులు అర్పించారు. . బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. గతేడాది ఆయన శత జయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న (Bharat Ratna)తో గౌరవించింది.



