నవతెలంగాణ-హైదరాబాద్: సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీ సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ని సందర్శించి మహాత్మా గాంధీకి హెర్మినీ నివాళులర్పించారు. ఆదివారమే ఈ పర్యటన కోసం హెర్మినీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈయన రాజధానికి చేరుకోకముందు ఆయన చెన్నై, ముంబయిలలో పర్యటించారు. ఫిబ్రవరి 10 వరకు ఆయన భారత్ పర్యటన కొనసాగనుంది.
కాగా, సీషెల్స్ భారతదేశానికి కీలకమైన సముద్ర పొరుగుదేశం. అలాగే భారతదేశం యొక్క విజన్ మహాసాగర్, గ్లోబల్ సౌత్ దేశాలలో నిబద్ధతగల ముఖ్యమైన భాగస్వామి సీషెల్స్‌నేనని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ పర్యటన సందర్భంగా సీషెల్స్ దేశాధ్యక్షుడు పాట్రిక్ హెర్మెనీ, ప్రధాని మోడీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు నేతలు అభిప్రాయాలను ఈ భేటీలో పంచుకోనున్నారు.


