Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఎం విశ్వకర్మ యోజన వస్తువులు వెంటనే పంపిణీ చేయాలి

పీఎం విశ్వకర్మ యోజన వస్తువులు వెంటనే పంపిణీ చేయాలి

- Advertisement -

–  బీజేపీ కౌన్సిలర్లు
నవతెలంగాణ – కామారెడ్డి 

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన లబ్ధిదారులకు వచ్చిన సామగ్రిని త్వరితగతిన పంపిణీ చేయాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టైలరింగ్, విశ్వబ్రాహ్మణ (అవుసుల), బోయ (బెస్త) తదితర వర్గాలకు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి అందించాల్సిన కుట్టుమిషన్లు, అవుసుల పనిముట్లు, బెస్తలకు సంబంధించిన సామగ్రి గత వారం రోజుల క్రితం కామారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయానికి చేరుకున్నాయి. అయితే ఈ వస్తువులను వెంటనే పంపిణీ చేయకపోవడంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కొంత సామగ్రి తడిసిపోయినట్లు సమాచారం.

ఈ విషయంపై సోమవారం ఉదయం బీజేపీ కౌన్సిలర్లు మోటారీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందు ముందు వర్షాలు పడే అవకాశం ఉన్నందున సామగ్రిని ఆలస్యం చేయకుండా లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని అధికారులను కోరారు. సిబ్బంది కొరత ఉంటే అదనపు సిబ్బందిని నియమించి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. వస్తువులు వచ్చిన రోజే సమాచారం ఇచ్చి ఉంటే ఎమ్మెల్యే సహకారంతో వీటిని ఉంచేందుకు తగిన ఏర్పాటు చేసి వెంటనే పంపిణీ చేసేవారమని వారు తెలిపారు.

 టార్పిండ్లు ( ప్లాస్టిక్ కవర్లు ) తెప్పించి భద్రపరుస్తాం. కామారెడ్డి ప్రధాన తపలయ కార్యాలయం మేనేజర్ కృపాకర్
 పోస్ట్ ఆఫీస్ లో సిబ్బంది తక్కువ ఉండడంతో పంపిణీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కరికి నాలుగు వస్తువులు, మూడు వస్తువులు, రెండు వస్తువులు రావడంతో అవన్నీ ఒకే చోట చేర్చడానికి సమయం పడుతుంది,  వీడియో అప్లోడ్ చేయడానికి అరగంట పడుతుందన్నారు. మేము ప్రతి ఒక్కరికి ఫోన్ చేసే వరకు ఎవరు రావద్దు. మేము ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి అందజేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -