నవతెలంగాణ నల్గొండ: పి ఎన్ బి మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (పి ఎన్ బి మెట్‌లైఫ్),నేడు తెలంగాణలోని నల్గొండలో తమ కొత్త శాఖను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఎక్కడ ఉన్నా కస్టమర్లుకు పాలసీ సేవలు, విశ్వసనీయ సలహాలను అందించడం ద్వారా బీమాను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే కంపెనీ నిబద్ధతను ఈ శాఖల ప్రారంభాలు ప్రతిబింబిస్తాయి.
పి ఎన్ బి మెట్‌లైఫ్ ఎండి & సీఈఓ సమీర్ బన్సాల్ మాట్లాడుతూ, “తమ వినియోగదారులతో పిఎన్‌బి మెట్‌లైఫ్ కొనసాగిస్తూన్నసంబంధా ఎల్లప్పుడూ పునాదిగావిశ్నిలుస్తోంది.భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు 182 శాఖలతో, మేము మా పరిధిని విస్తరించడమే కాకుండా, కస్టమర్లు తమ ప్రతి అడుగులోనూ మాపై ఆధారపడగలరనే భరోసా అందిస్తున్నాము. వారికి అత్యంత అవసరమైన చోట అందుబాటులో ఉండటంతో పాటుగా రక్షణను మరింత దగ్గరకు తీసుకురావడం, దానిని సులభతరం చేయడం, వారి ఆర్థిక భవిష్యత్తును నమ్మకంగా ప్లాన్ చేసుకోవడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం” అని అన్నారు.
సంస్థ తమ సొంత 182 శాఖలతో పాటు, 20,000 కంటే ఎక్కువ బ్యాంకాస్యూరెన్స్ భాగస్వామ్య కేంద్రాల ద్వారా వినియోగదారులను చేరుకుంటుంది. తద్వారా తన రక్షణ , పొదుపు పరిష్కారాలకు విస్తృతమైన మరియు నమ్మకమైన లభ్యతను అందిస్తుంది. విశ్వసనీయ భాగస్వామ్యాలతో దాని భౌతిక నెట్‌వర్క్‌ను కలపడం ద్వారా,పి ఎన్ బి మెట్‌లైఫ్ కస్టమర్లకు వారి ఆర్థిక ప్రయాణంలోని ప్రతి దశలోనూ స్థిరమైన,అధిక-నాణ్యత సేవా అనుభవాన్ని, మద్దతును అందిస్తూనే ఉంది.



