నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని సర్ సి.వి.రామన్ హైస్కూల్ పాఠశాలలో శనివారం ఆషాడమాసం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా మహాతల్లి పోచమ్మగా పోతరాజు వేషధారణతో ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాయిత నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆషాడమాసంలో వచ్చే బోనాలు పండుగను అత్యంత నియమ నిష్టలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రకృతి పరంగా ఆషాడమాసంలో వచ్చే ఈ పండుగ అన్ని పండుగలలో విశిష్టమైనది అన్నారు. ప్రకృతి అంతా చల్లగా మారి పాడిపంటలతో సస్యశ్యామలంగా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రతి గ్రామంలో ప్రజలు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారని అన్నారు. ఒక్కొక్క గ్రామంలో గ్రామదేవతలను ఏ పేరుతో పిలిచిన ఇందులో బోనం సమర్పించడం ప్రత్యేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సర్ సీవీ రామన్ పాఠశాలలో పోచమ్మ బోనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES