నవతెలంగాణ – చారకొండ
మండలంలోని గ్రామ దేవత పోచమ్మ, ఈదమ్మ, బోనాలను ఘనంగా నిర్వహించారు.గ్రామంలో మహిళలందరూ ఉపవాసం ఉండి అమ్మవారిని దర్శించు కుని మొక్కులు తీర్చుకు న్నారు. ఈ సందర్భంగా సాయంత్రం మహిళలు, ఆడప డుచులు గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తు కొని ఊరే గింపుగా బయలుదేరి డప్పుచ ప్పులతో నృత్యలు చేస్తూ దీప, దూపనై వేద్యాలు సమర్పించి, కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మ వారికి మొక్కులు సమ ర్పించుకు న్నారు. ఈ వేడుకల్లో భక్తులు, గ్రామప్రజలు, పలువురు నాయ కులు పెద్ద ఎత్తున పాల్గొని రేణుక ఎల్లమ్మ అమ్మవారికి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండా లని అమ్మవారిని వేడుకున్నారు. అంతక ముందు గ్రామప్రజలు.. గ్రామదేవతలకు ప్ర త్యేక పూజలు నిర్వహించారు.. కార్యక్రమంలో గ్రామ పెద్దలు,నాయకులు, మహిళలు, యువతీ, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.
జూపల్లి లోనూ పోచమ్మ బోనాలు
మండలంలోని జూపల్లి లో గ్రామ దేవత పోచమ్మకు బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఆలయానికి బయల్దేరారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులంతా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు.