Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పోచమ్మ బోనాలు 

ఘనంగా పోచమ్మ బోనాలు 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండలంలోని గ్రామ దేవత పోచమ్మ, ఈదమ్మ, బోనాలను ఘనంగా నిర్వహించారు.గ్రామంలో మహిళలందరూ ఉపవాసం ఉండి అమ్మవారిని దర్శించు కుని మొక్కులు తీర్చుకు న్నారు. ఈ సందర్భంగా సాయంత్రం మహిళలు, ఆడప డుచులు గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తు కొని ఊరే గింపుగా బయలుదేరి డప్పు చప్పులతో, యువకుల కేరింతతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి  దీప, దూప నైవేద్యాలు సమర్పించి, కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మ వారికి మొక్కులు సమర్పించుకు న్నారు.మరి కొంతమంది ఈదమ్మకు బోనాలు చేసి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండా లని అమ్మవారిని వేడుకున్నారు. అంతక ముందు గ్రామప్రజలు.. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. . వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. ఈ వేడుకల్లో భక్తులు  గ్రామ పెద్దలు,నాయకులు, మహిళలు, యువతీ, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -