- Advertisement -
– లక్ష 80 వేల క్యూసెక్కుల నీరు వచ్చిన నిలబడిన పోచారం..
– 104 ఏళ్లు దాటిన తగ్గని గట్టితనం..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మంగళవారం రోజు రాత్రి ప్రారంభమైన భారీ వర్షానికి ప్రాజెక్టులోకి 1.80వేల క్యూసెక్కుల వరద నీరు రావడం జరిగింది. 1.82 టిఎంసి కెపాసిటీ ఉన్న పోచారం ప్రాజెక్టులోకి సామర్థ్యాన్ని మించి వరద నీరు వచ్చిన ప్రాజెక్టు వరదను తట్టుకొని నిలబడింది. కేవలం గంగమ్మ ఆలయం వరకు ప్రాజెక్టుకు తాకి ఉన్న మట్టి కొట్టుకపోవడం జరిగింది. భారీ వరదను తట్టుకొని నిలబడిన పోచారం అప్పటి ఇంజనీర్లు డంగు సున్నం రాయితో నిర్మించిన పోచారం గట్టితనానికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
- Advertisement -