Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయంఅవిముక్తేశ్వరానంద సరస్వతిపై పోక్సో కేసు

అవిముక్తేశ్వరానంద సరస్వతిపై పోక్సో కేసు

- Advertisement -

యూపీ ప్రత్యేక కోర్టు ఆదేశం
మైనర్‌ బాలికలపై స్వామి లైంగిక దాడి

ప్రయాగ్‌రాజ్‌ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై పోక్సో కేసు నమోదు చేయాలని ప్రయాగ్‌రాజ్‌ ప్రత్యేక కోర్టు యుపి పోలీసులను ఆదేశించింది. గత నెలలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మాఘ మేళా సందర్భంగా నిందితుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇద్దరు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతపరమైన సేవ, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు నటిస్తూ సరస్వతి ఈ చర్యలకు పాల్పడ్డారని వారు పోలీసులకు తెలిపారు. అయితే పొలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై పోక్సో కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి వినోద్‌ కుమార్‌ చౌరాసియా విచారించారు. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు జరపాలని, బాధితుల గౌరవాన్ని కాపాడాలని పోలీసులను ఆదేశించారు. మాఘ మేళా అనేది ఏటా జరిగే జాతర. ఇందులో గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి యాత్రికులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఆ సమయంలో వందలాది మంది సాధువులు, మత పెద్దలు సంగం వద్ద తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమంలో 14, 17 ఏళ్ల వయసు గల ఇద్దరు మైనర్లపై అత్యాచారయత్నం జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ‘గురు సేవ’ పేరుతో మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన స్వామిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని శాకుంభరీ పీఠాధీశ్వర్‌ అశుతోష్‌ బ్రహ్మచారి మహారాజ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -