- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రజాశక్తి, నవతెలంగాణ బుక్ హౌస్, ఎడిటోరియల్ బోర్డులో సుదీర్ఘకాలం పని చేసిన తంగిరాల చక్రవర్తి గుండె పోటుతో శనివారం ఉదయం చనిపోయారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ కవి, రచయితగా అనేక పుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. బాలాపూర్ లోని వారి నివాసం వద్ద ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి.
- Advertisement -