- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
ప్రముఖ కవి, రచయిత బిర్రు పరమేశ్వర్ కీర్తి రత్న పురస్కారం అందుకున్నారు. భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ వారు ఆదివారం రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని కవితా గానం చేశారు. సాహితీ రంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి భవానీ సాహిత్య వేదిక ప్రతినిధులు పరమేశ్వర్ ను కీర్తి రత్న పురస్కారంతో సత్కరించారు. పరమేశ్వర్ మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తు, పలు వేదికలపై సామాజిక అంశాలపై తన కవితా గానంతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.
- Advertisement -