Friday, November 21, 2025
E-PAPER
Homeజిల్లాలుజిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం..

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం..

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. భీంగల్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ కవి సమ్మేళనంలో పాల్గొని పుస్తక ప్రాముఖ్యతను తెలియజేసే “పుస్తకం జ్ఞాన మార్గదర్శి” అనే కవితా శీర్షికన కవితను చదివి వినిపించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కంకణాల రాజేశ్వర్ కు శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ.. కవి సమ్మేళనంలో నిజామాబాద్ జిల్లా నుండి నేను ఒక్కడినే పాల్గొనడం అరుదైన విషయం అని అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎస్. వంశీకృష్ణ, కామారెడ్డి జిల్లాకు చెందిన కవులు, కవయిత్రులు, కళాకారులు మోత్కూరి అశోక్ కుమార్, అంబీర్ మనోహర్, సిరిసిల్లా గఫూర్ శిక్షక్, రుద్రంగి రమేశ్, ఎనిశెట్టి గంగా ప్రసాద్, కౌడి రవీందర్, తగిరంచ నరసింహారెడ్డి, అల్లి మోహన్ రాజ్, పురం గంగా, ఓరగంటి హేమలత, మంద పితాంబర్, ఉమా శేషారావు వైద్య, తిరుమల తిరుపతిరావు, తిరుమల కైలాస్, బాల కవయిత్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -