- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
దాశరథి రంగాచార్య పుట్టినరోజు సందర్భంగా నిజాంబాద్ జిల్లా జైలులోని దాశరథి కృష్ణమాచార్య విగ్రహాన్ని ఇందూరు జిల్లా కవులు సందర్శించినారు. దాశరథి రంగాచార్య జన్మదినాన్ని ఆగస్టు 24న నిర్వహించుకునే సందర్భంలో రంగాచార్య రాసిన నవలలను గుర్తు చేసుకుంటూ.. వారి సాహిత్యాన్ని స్మరిస్తూ జిల్లా కవులు వారి సోదరులైన కృష్ణమాచార్య జైలుని ఆదివారం నాడు సందర్శించి, వారికి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అష్టావధాని డాక్టర్ గణపతి అశోక్ శర్మ ,ప్రముఖ కవులు డాక్టర్ కాసర్ల నరేశ్ రావు,డాక్టర్ శారద ,తొగరి రాజేశ్వర్, చింతల శ్రీనివాస్ గుప్తలు పాల్గొన్నారు.
- Advertisement -