- Advertisement -
శిబిరంపై దాడి, కార్పొరేటర్ భర్తతో పాటు 10 మంది అరెస్ట్
నవతెలంగాణ-నయీంనగర్
వరంగల్ నగరంలోని సుబేదారి కనకదుర్గ కాలనీలోని బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్ రెడ్డితో సహా ముగ్గురు మహిళలతో కలిపి మొత్తం పదిమందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.60 వేలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని సుబేదారి పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేశారు.
- Advertisement -