Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేకాట మీ జీవితాలను ముంచుతుంది: జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్..

పేకాట మీ జీవితాలను ముంచుతుంది: జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్..

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
పేకాట ఆడుతూ పట్టుబడిన వారు పోలీస్ స్టేషన్ లు కోర్టుల చుట్టూ తిరిగి తమ పరువు పోవడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతారని పేకాట ఆడడం వలన దుష్పరిణామాలే తప్ప ఉపయోగం ఏమీ లేదని జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్ అన్నారు. బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ, న్యాయ విజ్ఞాన సంస్థ బిచ్కుంద ఆధ్వర్యంలో కోర్టు జ్యుడీషియల్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడిన వారికి పేకాట ఆడడం వలన కలిగే దుష్పరిణామాల పై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. పేకాట ఆడడం వలన తమ వద్ద ఉన్న డబ్బులు పోగొట్టుకున్న వారు అప్పులపాలు కావడం ఆర్థికంగా నష్టపోవడం వేరే దారి లేక దొంగతనాలకు పాల్పడడం ఇతర నేరాలు చేయడం జైలు పాలు కావడం సమాజంలో పరువుగా బతుకుతున్న మీ కుటుంబాల పైన నింద పడుతుందని అన్నారు.

దీంతో మీ కుటుంబ సభ్యులు మానసికంగా కుంగి పోవడం మీరు చేసుకునే వ్యవసాయం, వ్యాపారాలు కోల్పోవడం పిల్లలు చదువులకు దూరం కావడం ఆర్థికంగా దెబ్బతిని కుటుంబాలు వీధిన పడతాయని అన్నారు. పేకాట ఆడే వారితో పాటు పేకాట శిబిరాలు నిర్వహించిన ఇండ్లలో పేకాట ఆడించిన వారు కూడా శిక్షార్హులేనని అన్నారు. పేకాట ఆడుతూ దొరికిన వారికి మొదటి దఫగా పెనాల్టీలు వేసి వదిలేయడం జరగుతుందని రెండవసారి మళ్లీ పేకాట ఆడుతూ దొరుకితే పెనాల్టీతోపాటు  జైలుకే పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా పేకాటరాయులకు జడ్జి హెచ్చరించారు. మళ్లీ పేకాట ఆడమని కోర్ట్ ప్రాంగణంలో వారితో జడ్జి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మోహన్ రెడ్డి, బార్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్ రావు, మల్లేశం, మొహమ్మద్, కోర్టు సిబ్బంది సుదర్శన్ గౌడ్, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad