Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేవరాంపల్లిలో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

దేవరాంపల్లిలో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరంపల్లి గ్రామంలోని అనంతుల రాజసమయ్య కిరాణా షాపులో దొంగతనం చేసిన గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఆకుదారి శ్రీకాంత్, దుర్గం బద్రీనాథ్ లను అరెస్టు చేశామని తెలిపారు. అదేవిధంగా వారి నుంచి రూ.8300 నగదును, రెండు మొబైల్ ఫోన్లను, నాలుగు ట్రాక్టర్ బ్యాటరీలను, ఒక హోమ్ థియేటర్ లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అనంతరం రిమాండ్ తరలించినట్లు ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -