మూఢనమ్మకాలు సైబర్ నేరాలపై అవగాహన
ఎస్సై చిర్ర రమేష్ బాబు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని కచికల్ గ్రామంలో సామాజిక సమస్యలు మరియు ప్రజా భద్రతకు సంబంధించి నిర్వహించిన పోలీసు అవగాహన కార్యక్రమాన్ని వివరిస్తుంది. ‘పోలీస్ కళాజాగృతి’ కార్యక్రమం నిర్వహించామని నెల్లికుదురు ఎస్సై చిర రమేష్ బాబు తెలిపారు. శనివారం మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, రహదారి భద్రత, గంజాయి మరియు ఆన్‌లైన్ గేమింగ్ వల్ల కలిగే ప్రమాదాల వంటి అంశాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ ఇట్టే లీలా దేవేందర్ రెడ్డి తో కలిసి ఎస్సై చిర్ర రమేష్ బాబు మాట్లాడుతూ కాచికల్ గ్రామాన్ని గంజాయి రహితంగా మార్చాలని, హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించాలని గ్రామ అధికారులు, నివాసితులు తీర్మానించుకున్నారు తెలిపారు.మెరుగైన భద్రత కోసం అన్ని వార్డులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో గ్రామంలో ఎలాంటి దొంగతనాలకు పాల్పడేవారు ఉండరని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మహిళా సంఘం సభ్యులు పోలీసు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.



