- Advertisement -
నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలో నిజామాబాద్ పోలిస్ కళా బృందం వారు మాదక ద్రవ్యాలు,గంజాయి, హెల్మెట్ ధరించడం, సైబర్ క్రైం గురించి మంగళవారం ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ మాట్లాడుతూ… యువకులు గంజాయికి,మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించి రోడ్డు ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు.సైబర్ క్రైం లో భాగంగా ప్రజలు అప్రమత్తతో ఉండాలని,ఫోన్ కు వచ్చే అనవసర మెసేజ్ లను,లింక్ లను ఓపెన్ చేయవద్దని,అలా చేస్తే తమ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు.
- Advertisement -