పోలీస్ సేవలకు సెల్యూట్..
కత్తి మీది సామి పోలీస్ కర్తవ్యం..
వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో నవతెలంగాణ ముఖా ముఖి..
నవతెలంగాణ – వేములవాడ
కాకి బట్టలు వేసుకోవాలని యువతలో చాలా కోరిక ఉంటుంది.. పోలీస్ జాబ్ సాధించాలంటే, క్రమశిక్షణ, ఓర్పు, సహనం, ఎన్నో కష్ట నష్టాలను అధిగమించి పోలీస్ కొలువు సాధించడం ఓ యజ్ఞం.. ప్రజల మాన – ప్రాణాలను, శాంతిభద్రతలను పర్యవేక్షణ కోసం అంకితభావంతో పని చేయాలి, ఏ ప్రభుత్వ ఉద్యోగి కైనా నియమిత పనిగంటలు, సెలవులు ఉంటాయి. కానీ ఒక పోలీస్ కు మాత్రం 24 గంటలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది,పోలీస్ కర్తవ్యం కత్తిమీది సామి.. అన్ని తెలిసి కూడా ప్రజలకు ఏదో మన ద్వారా సేవ చేయాలి అనే భావించి ఇంజనీరింగ్ లో చేరి యుటర్న్ తీసుకొని సివిల్స్ చేసి ఐపిఎస్ కొట్టిన వేములవాడ యువ ఏఎస్పి శేషాద్రి రెడ్డి ఐపీఎస్ తో నవ తెలంగాణ స్పెషల్ ఇంటర్వ్యూ..
నవతెలంగాణ : పోలీస్ శాఖ లోకి రావాలనే ప్రేరణ, మీ కుటుంబ పద్యం ఏంటి..?
ఏఎస్పి : పుట్టింది పెరిగింది, చదువుకున్నది అంతా హైదరాబాద్ లో, డాడీ వాళ్ళు ఉండేది భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర లింగారెడ్డిగూడెం. డాడీ సివిల్ కాంట్రాక్టర్ గా పని చేసేవారు, అమ్మ హౌస్ వైఫ్. ఐపీఎస్ కావాలనేది నాన్న నుండి ప్రేరణగా తీసుకొని ఇంజనీరింగ్ మధ్యలో మానేసి, ఐపీఎస్ కావాలని ఇంట్రెస్ట్ తో ఐపీఎస్ ప్రిపేర్ అయ్యాను సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించి డైరెక్ట్ ఏఎస్పీగా వేములవాడ పోస్టింగ్ వచ్చింది.
నవతెలంగాణ : నియోజకవర్గం లో మీరు ముఖ్యంగా దృష్టి పెట్టిన సమస్యలు ఏమిటి..?
ఏఎస్పి : వేములవాడ రాజన్న దర్శనార్థం ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తుంటారు, ముఖ్యంగా టెంపుల్లో సెక్యూరిటీ పరంగా హోంగార్డ్స్ నియమించి, పట్టణంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో కోఆర్డినేషన్ చేయడం. వేములవాడ పట్టణ పరిధిలో సుమారుగా 113 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కెమెరాలు ఏర్పాటు చేయడం తో పాటు ప్రతి గ్రామంలో, గ్రామ పోలీస్ ను కేటాయించడం. ప్రత్యేకించి పెట్రోలింగ్ గస్తీ ఎప్పుడు ఉండేలా చర్యలు తీసుకోవడం. పట్టణంలో లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా స్టేషన్ సిబ్బంది మోటివేషన్ చేయడం టెంపుల్ రోడ్డు డెవలప్మెంట్ సమయంలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. నియోజకవర్గం ప్రస్తుతానికైతే పీస్ ఫుల్ గా ఉంది..
నవతెలంగాణ : పోలీస్ శాఖలో ఏఎస్పీగా మీ ప్రధాన బాధ్యతలు ఏమిటి..?
ఏఎస్పి : వేములవాడ నియోజకవర్గ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ మానిటరింగ్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చే పిటిషనర్లకు పోలీస్ నుండి న్యాయం జరుగుతుందో లేదో, కింది సిబ్బంది సరిగ్గా విధులు నిర్వహిస్తున్నారు లేదో పర్యవేక్షించడం, ఫిర్యాదుల పట్ల స్పందించకపోతే నేరుగా నా దగ్గరికి వచ్చే సమస్యను చెప్పుకునేలా చూస్తున్నాం. స్టేషన్ కు వచ్చిన వారిని చట్టపరంగా న్యాయం చేయడం, పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం. ఎస్ హెచ్ ఓ లకు లాండ్ ఆర్డర్ కు అనుగుణంగా ఉండేలా తగు జాగ్రత్తలు, స్టేషన్ విసిటింగ్, రికార్డుల పర్యవేక్షణ లాంటివి ఇతర బాధ్యతలు ఉంటాయి.
నవతెలంగాణ : మహిళల భద్రతపై ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు..?
ఏఎస్పి: మహిళ భద్రత కోసం ఎప్పటికప్పుడు బస్టాండ్ లో, రద్దీగా ఉండే ప్రాంతాలలో, దేవాలయ పరిసర ప్రాంతాలలో మఫ్టీలో షీ టీమ్స్ తో పర్యవేక్షించడం జరుగుతుంది. కాలేజీ,స్కూల్ విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వడంతో పాటు పోలీస్ కోఆర్డినేషన్ తో గర్ల్స్ కి కరాటే శిక్షణ, గుడ్ టచ్.. బాడ్ టచ్ లాంటి మోటివేషన్ చేయడం. ప్రయాణించే మహిళలకు ఆటో సేఫ్ , క్యూఆర్ కోడ్ విధాన తీసుకోవచ్చా. ఎక్కడైనా మహిళలపై క్రైమ్ జరిగితే సత్వర న్యాయం చేయడానికి స్పెషల్ టీం లను ఏర్పాటు చేసి విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తున్నాం.
నవతెలంగాణ: సివిల్స్ ప్రయాణంలో మీకు ఎదురైన అడ్డంకులు ఎలా ఎదుర్కొన్నారు..?
ఏఎస్పి : మొదట్లో మూడు నాలుగు నెలలు చాలా శరీరక శ్రమ, ఉదయం నాలుగు గంటలకు లేస్తే ఏడు గంటల వరకు ట్రైనింగ్ షెడ్యూల్ ఉంటుంది, ట్రైనింగ్ టైం అంటే టైం కాస్త వెసలపాటు కూడా ఇవ్వరు ట్రైనింగ్ లో డిస్ప్లే, సెల్ఫ్ రెస్పెక్ట్,కాన్ఫిడెన్స్ కొత్త అనుభూతి లభిస్తుంది, రన్నింగ్ అంటే చాలా ఇష్టం షూటింగ్, ఫైరింగ్,హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ ట్రైనింగ్ లో ఇస్తారు 11 నెలల జర్నీలో ఎన్నో కొత్త అనుభవాలు, అడ్డాకులంటూ ఏమీ ఎదురు కాలేదు.
నవతెలంగాణ : డాక్టర్ లేక, ఇంజనీర్ కాకుండా ఐపీఎస్ ను ఎందుకు ఎంచుకున్నారు..?
ఏఎస్పి : పోలీస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇంజనీరింగ్ చదువుతున్న మధ్యలో సివిల్స్ పై ఇంట్రెస్ట్ రావడంతో, నాన్న ప్రోత్సాహంతో మా నాన్న ఫుల్ స్వేచ్ఛ, మోటివేషన్ ఇచ్చారు. ఎవరైనా పోలీస్ మాట వినవల్సిందే, శాంతిభద్రతలు పర్యవేకించడంలో కీలకం.. పోలీస్ అంటే గౌరవం.. నాకు సివిల్స్ సర్వీస్ లో కిరణ్ బేడీ అంటే ప్రత్యేకమైన ఇన్స్పిరేషన్ ఆమె స్ఫూర్తితోనే ఐపీఎస్ ప్రిపేర్ అయ్యాను మనకంటూ సంఘంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ఆకాంక్ష..
నవతెలంగాణ : వేములవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం మతపరమైన ఆచారాలు ఎక్కువ, శాంతిభద్రతలు ఎలా కంట్రోల్ చేస్తున్నారు.
ఏఎస్పి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇక్కడ అంతా శాంతియుత వాతావరణం లో ఉంది మతపరమైన సంఘటనలు ఏమి తలెత్తలేదు. స్పెషల్ ఐడి పార్టీ, ఇంటెలిజెన్స్ ద్వారా సమస్యలను గుర్తించి ముందస్తుగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ మధ్యలో అఘోరి దేవాలయంలోని దర్గాను తొలగించాలని మతపరమైన రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినప్పుడు ముందస్తు చర్యలతో కట్టడి చేసి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. కొందరు బక్రీద్ రోజున లేని దాన్ని ఉన్నది అని అత్యుత్సాహంతో మతపరమైన ఘర్షణకు తావివ్వకుండా జిల్లా ఎస్పీ, నేను, స్థానిక పోలీస్ అధికారులతో దగ్గరుండి శాంతి భద్రతలను పర్యవేక్షించడం జరిగింది. ఎప్పుడు సోషల్ మీడియాపై సైతం స్ట్రిక్ట్గా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తూనే ఉంటాం.
నవతెలంగాణ : కొన్ని స్టేషన్లో చిన్న చిన్న నేరాలకు స్టేషన్ బెయిల్ ఇచ్చే క్రమంలో, సివిల్ పంచాయతీ, ఇతర సమస్యలపై వచ్చే వారి నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ ఉంది. ఇలాంటి సంఘటనలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా..?
ఏఎస్పి : చిన్న చిన్న నేరాలు బెయిల్ ఇచ్చే సమయంలో, సమస్యలపై వచ్చే వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు అక్కడక్కడ జరుగుతున్నట్లు విన్నది కానీ, అలాంటి సంఘటనలు అయితే వన్ ఇయర్ లో నా దృష్టికి అయితే రాలేదు. అలా చేస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. బాధితులు స్టేషన్ లో డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు, పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయతీ, సెటిల్మెంట్ లు చేస్తే రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ నుండి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి, అలా చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. అలాంటి సివిల్స్ సంబంధించి ఫిర్యాదులు వస్తే కోర్టును ఆశ్రయించాలని ఆదేశాలు ఉన్నాయి.
నవతెలంగాణ : సాధారణ పౌరులకు పోలీస్ అంటే భయం కాకుండా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనిపించేలా మీ సిబ్బందికి ఎలాంటి సూచనలు ఇచ్చారు.
ఏఎస్పి : ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండడం.. నేరస్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తాని బాధితులకు న్యాయం జరుగుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదారుడు నుండి రిసెప్షన్ వద్ద పిటిషన్ తీసుకోవడం, అక్షరాస్యత లేని వారికి డ్రాపింగ్ చేసి ఇవ్వడం. అక్కడ ఏమైనా సిబ్బంది చేతివాటం చూపిస్తే ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని స్టేషన్లో అలా జరిగితే తీసివేయడం జరిగింది. అటాచ్ చేయడం, మెమో జారీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ నేరస్తులకు మాత్రం కాదు యాక్షనే ఉంటుంది. బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించకపోతే బాధితులకు న్యాయం జరగదు.
నవతెలంగాణ : యువ ఐపీఎస్ గా యువతీ- యువకులకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు..
ఏఎస్పి : ఏది ఊరికనే రాదు..మీ లక్ష్యం పైన దృష్టి పెట్టండి, ఆకాశమే హద్దుగా ఏదైతే అనుకుంటామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఒక మంచి ప్రణాళిక, క్రమశిక్షణ, నిబ్బదత ఉండాలి.ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పేరెంట్స్ పిల్లల ఇష్ట ఇష్టాలను గుర్తించి ఎంకరేజ్మెంట్ ప్రోత్సహిస్తే వాళ్ళ ఎంచుకున్న కెరియర్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహితులకు దూరంగా ఉండి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేయాలి. అప్పుడే నీవు ఎంచుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
నవతెలంగాణ : గంజాయి నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఏఎస్పి : గంజాయి వినియోగించే వారి విషయంలో ఇప్పటివరకు కఠినంగానే వివరిస్తున్న, అయినప్పటికీ కొందరు దొడ్డిదారులు విక్రయిస్తూ, వ్యసనానికి బానిసలై వారి జీవితంతో పాటు కుటుంబ పరువును తీస్తున్నారు. మత్తు పదార్థాలపై స్కూళ్లల్లో, కాలేజీల్లో మోటివేషన్ ఇస్తూనే ఉన్నాము. గంజాయి సేవించడం, విక్రయించడం చాలా పెద్ద నేరం. ఇలాంటి సంఘటన జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కట్టడి జరిగేలా చూస్తున్నాం. పెట్రోలింగ్ పోలీసులు వద్ద టెస్టింగ్ కిట్ల ద్వారా గంజాయి సేవించిన వారిని గుర్తించి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గంజాయి రవాణా ఆపేందుకు ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం వలనే ఇన్ని కేసులు నమోదవుతున్నాయి.