నవతెలంగాణ-రాయికల్
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు.. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ సూచనలతో మండలంలోని భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సై సుధీర్ రావు ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందం‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు, సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రతా నియమావళి అంశాలపై విద్యార్థులకు వివరించారు. ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక చైతన్యం కల్పించారు. ఆధునిక చట్టాలపై సమగ్ర అవగాహన అందించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ తరహా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సానుకూల మార్పు వస్తుందని పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, ఉపాధ్యాయ బృందం, పోలీస్ కళాబృందం మనోజ్ కుమార్, గడ్డం రమేష్, కమల్, సతీష్, లక్ష్మణ్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.



