- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ పోలీస్ స్టేషన్లో సిఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల గురించి వాహనదారులకు తెలిసే విధంగా పోలీసులు అరైవ్ అలైవ్, డిఫెన్స్ డ్రైవింగ్, పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు, యువకులు, జర్నలిస్టులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై వీడియో తీయించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ట్రాపిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బిట్ల పెర్సిస్, ఎస్ఐ 2గంగాధర్ , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



