నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వహణలో భాగంగా త్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగం వలనే నేడు శాంతియుత వాతవరణం నెలకొన్నదని . ప్రజలు కూడా శాంతి యుతంగా ఉంటున్నారని, వారి త్యాగలను గుర్తు చేసుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు అక్టోబర్ త21 నుండి అక్టోబర్ 31 వరకు నిజామాబాద్ కమిషనరేటులోని నిజామాబాద్, ఆర్మూర్,బోధన్, డివిజన్ ల పరిధిలలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అక్టోబర్ 21న జనరద్దీ గల ప్రదేశాలలో, ఆర్.టి.సి బస్టాండ్లలో, రైల్వే స్టేషన్స్ యందు బ్యానర్స్, హోర్డింగ్స్, పోస్టర్ లు ఏర్పాటు చేయడం, అమరవీరుల దినోత్సవ కార్యక్రమం పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఉదయం 8 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 22వ తేదీ అమరవీరుల కుటుంబాలను పరమర్శించడం నిజామాబాద్ డివిజన్ లో మాత్రమే, అక్టోబర్ 23న వ్యాసరచన పోటీలు ( తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ లో) నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఆన్లైన్ లో,అంశము : డ్రగ్స్ నిర్వహణ నివారణలో పోలీసుల పాత్ర మరియు విధ్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు.షార్ట్ ఫిలిమ్స్ కాంపిటేషన్ (3 నిమిషాల విడిదిగలవి ), ఫోటో గ్రాఫి కాంపిటేషన్, అక్టోబర్ 24న అమరవీరుల కుటుంబాలను పరమర్శించడం ఆర్మూర్, బోధన్ డివిజన్ ల లో మాత్రం. అక్టోబర్ 25న సైకిల్ ర్యాలీ మరియు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ (డిచ్ పల్లి నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ) ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 26న వ్యాస రచన పోటీలు (తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో ) ఉంటాయన్నారు.క్యాటగిరి 1 లో కానిస్టేబుల్ నుండి ఎ.ఎస్.ఐ వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. అంశం : పని ప్రదేశంలో లింగ వివక్షత.క్యాటగిరి 2 లో ఎస్.ఐ నుండి ఆ పై స్థాయి వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి.అంశము: నేల స్థాయి పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం.అక్టోబర్ 27న నిజామాబాద్ డివిజన్ లో కొన్ని కాలనీలలో, కొన్ని గ్రామాలలో ప్రజలకు ఎమి అవసరమో వాటిని గుర్తించడం, అక్టోబర్ 28న ఆర్మూర్, బోధన్ డివిజన్ లో కొన్ని కాలనీలలో, కొన్ని గ్రామాలలో ప్రజలకు ఎమి అవసరమో వాటిని గుర్తించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 29న పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు రక్తదాన శిబిరం కార్యక్రమం ఉంటుందన్నారు. అక్టోబర్ 30 నాడు ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాలు నిర్వహణ, అక్టోబర్ 31న క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం గాంధీ చౌక్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ఉంటుందని తెలిపారు.
నిజామాబాద్ లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES