నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో ఎస్బిఐ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని నేరస్తులు మంగళవారం గ్యాస్ కట్టర్ తో ఏటీఎంలో ప్రవేశించి దొంగతనం కొరకు ప్రయత్నం చేశారు. అలర్ట్ మెసేజ్ అందుకున్న టౌన్ 3 పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకోగా వారు ఈకో వ్యాన్లో పారిపోయి పాల్ద గ్రామ శివారులో వ్యాన్ వదిలేసి పారిపోయారు.
ఈ సంఘటన స్థలాన్ని ఏటీఎం సెంటర్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించి , నేరం జరిగిన విధానాన్ని పరిశీలించి ఎస్సై హరిబాబు, సిఐ శ్రీనివాస్ రాజు లకు సూచనలు ఇచ్చి వీలైనంతవరకు త్వరగా నేరస్తులను పట్టుకోవాలి అని ఆదేశించారు. క్లూస్ టీం , సిసిఎస్ టీం అధికారులకు కేసు పరిశోధనకు సంబంధించి తగు ఆదేశాలు జారీ చేశారు.