నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హల్ యందు నిర్వహించగా ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విఐపి ల భద్రతా నేపథ్యంలో సేవలు అందించే పిఎస్ఓ పాత్ర అత్యంత ముఖ్యమైనది. కావున మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి , అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, ఇంకా అత్యవసర పరిస్థితుల్లో మీరు తీసుకోవలసిన చర్యలపై స్పష్టత ఇవ్వడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది అని అందుకోసమే ఈ శిక్షణ ఏర్పాటుచేయబడింది అని అన్నారు.
ఈ శిక్షణలో మీరు పొందే జ్ఞానం, అనుభవం మీ బాధ్యతల్ని మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు దోహదపడుతుంది. ప్రతి పీఎస్ఓ అధిక నైపుణ్యంతో, పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు వెళ్ళడానికి ఉపయోగ పడుతుంది అన్నారు. మీ భవిష్యత్తు సేవలకు ఈ శిక్షణ మైలురాయిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. కావున ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమంను ప్రతీ పి ఎస్ వో సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.ఈ సందర్భంగా అదనపు డీసీపీ ఏ ఆర్ ఏ రామచంద్ర రావు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ శ్రీనివాస్, తిరుపతి , సతీష్ , శేఖర్ బాబు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES