Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిరాణ దుకాణంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

కిరాణ దుకాణంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

 
నవతెలంగాణ – వర్ధన్నపేట 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గాయత్రీ కిరణంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఐదు కింటాల 90 కిలోల పురుగులతో కూడిన తూట్టెలు పట్టిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో వివిధ షాపులలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వివరిస్తున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. కిరాణం షాపుల తో పాటు పలు, బేకరీలను, ఓటళ్ల ను, బిర్యానీ సెంటర్లను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇట్టి విషయంపై ఎస్సై సాయిబాబా వివరణ కోరగా విశ్వాసనీయ సమాచార మేరకు గాయత్రీ కిరాణంలో రేషన్ బియ్యం తొట్టెలు కట్టి ఉన్నాయని నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 5 కింటాల 90 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లో భద్రపరచామని, సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. సివిల్ సప్లై అధికారుల విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై సాయిబాబు తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై రాజు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -