- Advertisement -
- – మైదానంలో క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
- నవతెలంగాణ – బెజ్జంకి
- మాదకద్రవ్యాల దుష్పప్రభావలపై అవగాహన కల్పించడానికి.. జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటిలను రేపు (సోమవారం) ప్రారంభించనున్నట్టు ఎస్ఐ సౌజన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో క్రీడలను నిర్వహించనున్నట్టు ఎస్ఐ పెర్కొన్నారు. క్రీడల నిర్వహణకు మైదానాన్ని చదును చేసి ఏర్పాట్లు పూర్తి చేశామని మండలంలోని అయా గ్రామాల యువకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరవ్వాలని ఎస్ఐ సూచించారు. సందేహాలకు క్రీడల సమన్వయకర్త కానిస్టెబుల్ కొడిశెల శ్రీనివాస్ ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.
- Advertisement -