Monday, March 23, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

- Advertisement -

– నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి
– సీఐ నాగరాజు రెడ్డి 
నవతెలంగాణ – అశ్వారావుపేట

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడానికి పోలీసులు సోమవారం పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాలు, కీలక వార్డుల్లో పోలీసు సిబ్బంది పాదయాత్ర చేస్తూ ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు సీఐ నాగరాజు రెడ్డి తెలిపారు.

చట్టం మా చేతిలోనే ఉందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు కూడా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరగేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు యయాతి రాజు,అఖిల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -