Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిరుదొడ్డి జెడ్పీటీసీ బరిలో పోలీస్ రాజులు 

మిరుదొడ్డి జెడ్పీటీసీ బరిలో పోలీస్ రాజులు 

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి 
మిరుదొడ్డి జెడ్పిటిసి బీసీ జనరల్ రావడంతో అల్వాల గ్రామానికి చెందిన పోలీస్ రాజులు జెడ్పిటిసి బరిలో ఉంటున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ కార్యకర్తలు తోపాటు రాజకీయ నాయకుల  కృషితో జడ్పిటిసిగా పోటీ చేస్తానని అన్నారు. సిద్దిపేట జిల్లాలో పోలీస్ ఉద్యోగం నుండి పదవి విరమణ తర్వాత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ రంగంలోకి రావడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళల సేవ చేయడమే లక్ష్యంగా ఎంచుకున్న పోలీస్ రాజులు మిరుదొడ్డి మండలంలో ప్రజల సమస్యల కోసం పనిచేస్తూ ప్రజల్లో ఉండి సేవ చేయడం వలన ఎంతో సంతృప్తి ఉంటుందని తెలిపారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ లో పని చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -